Fri Dec 05 2025 12:40:44 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్తను పట్టపగలే..!
జగిత్యాల జిల్లా కోరుట్లలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ భర్తను పట్టపగలే

జగిత్యాల జిల్లా కోరుట్లలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ భర్తను పట్టపగలే అది దారుణంగా హతమార్చారు. పట్టణంలోని తొమ్మిదో వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ భర్త పోగుల లక్ష్మీరాజం(48) పై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్య చేశారు. బైక్‌పై వచ్చి అందరూ చూస్తుండగానే కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో లక్ష్మీరాజం మెడపై తీవ్రగాయాలవ్వగా స్థానికులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. పెద్దఎత్తున రక్తస్రావం జరగటంతో పరిస్థితి పూర్తిగా విషమించింది. హాస్పిటల్ లో చేరిన కాసేపటికే ఆయన ప్రాణాలు వదిలారని ఆసుపత్రి సిబ్బంది తెలిపింది.
కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా వద్ద ఓ హోటల్లో లక్ష్మీరాజం టీ తాగుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు అక్కడికి వచ్చి ఆయనపై దాడి చేశారు. కత్తితో మెడపై తీవ్రంగా గాయపరిచారు. పరిస్థితిని గమనించిన కొందరు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. ఘటనాస్థలిని డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story

