Wed Dec 17 2025 06:44:28 GMT+0000 (Coordinated Universal Time)
లవ్ మ్యారేజ్.. మనస్తాపంతో వరుడు ఆత్మహత్య
ఆ తర్వాత యువతిని చంద్రయ్య ఇంటికే పరిమితం చేశాడు. పెళ్లిచేస్తానని నమ్మించి రప్పించావని, తన భార్యను..

జనగామ జిల్లా పెద్దపహాడ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని పెళ్లిచేసుకున్న వరుడు.. మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి తండ్రి చంద్రయ్య ఇద్దరికీ ఘనంగా పెళ్లి జరిపిస్తానని నమ్మించి ఊరికి రప్పించాడు.
ఆ తర్వాత యువతిని చంద్రయ్య ఇంటికే పరిమితం చేశాడు. పెళ్లిచేస్తానని నమ్మించి రప్పించావని, తన భార్యను తనతో పంపాలని సాయి అడగ్గా.. కూతుర్ని పంపకుండా చంద్రయ్య సాయిని వేధించసాగాడు. దీనిపై సాయి పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. పెద్దమనుషుల సమక్షంలో తేల్చుకోవాలని సూచించారు. దాంతో సాయి పెద్దలతో పంచాయతీ పెట్టించాడు. పంచాయతీలో చంద్రయ్య.. సాయి తనకు నచ్చలేదని, తనకూతుర్ని పంపేది లేదని తేల్చి చెప్పేశాడు. దాంతో మనస్తాపానికి గురైన సాయి.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

