Sun Mar 15 2026 14:04:29 GMT+0530 (India Standard Time)
విశాఖపట్నంలో కలకలం సృష్టించిన బాలుడి హత్య
విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఓ బాలుడు

విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఓ బాలుడు (17) దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి దుండుగులు సముద్రంలో పడేశారు. సంఘటనాస్థలిని వన్‌టౌన్ పోలీసులు పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎవరా బాలుడు:
విశాఖ సాగర తీరంలో ఓ బాలుడ్ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. బాలుడి డెడ్‌బాడీని గోనెసంచిలో చుట్టి ఫిషింగ్ హార్బర్ సముద్రంలో విసిరేశారు గుర్తు తెలియని వ్యక్తులు. సమాచారం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు మృతదేహం లభ్యమైన చోటకు వచ్చారు. బాలుడి డెడ్‌బాడీ పోస్టుమార్టం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఘటనలో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ హత్య ఘటన విశాఖ సిటీలో కలకలం సృష్టించింది.
Next Story

