Sun Nov 03 2024 12:49:45 GMT+0000 (Coordinated Universal Time)
సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు.. బతికి బట్టకట్టాలంటే?
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు మరోసారి బెదిరింపులు వచ్చాయి.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచే ఈ బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బతికి బట్టకట్టాలంటే ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేకుంటే సిద్ధిఖీ కంటే దారుణంగా చంపుతామని ఆగంతకులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో సల్మాన్ ఖాన్ కు ముంబయి పోలీసులు భారీగా భద్రత పెంచారు.
ముంబయి పోలీసులకు...
ముంబయి ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నంబర్కు గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఈ బెదిరింపు మెసేజ్ పంపారు. దీంతో పోలీసులు అప్రమత్తమయి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో శత్రుత్వాన్ని ముగించుకోవాలన్నా ఆయన ఐదుకోట్లు ఇవ్వాలంటూ ఈ మెసేజ్ సారాంశం. అయితే ఈ బెదిరింపు మెసేజ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై విచారణ జరుపుతున్నామని ముంబయి పోలీసులు తెలిపారు.
Next Story