Thu Sep 19 2024 02:03:09 GMT+0000 (Coordinated Universal Time)
నూడుల్స్ పరిశ్రమలో భారీ పేలుడు.. 5గురు మృతి
బీహార్ లోని ప్రముఖ నూడుల్స్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ముజఫర్ పూర్ జిల్లా భేలాలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో
బీహార్ లోని ప్రముఖ నూడుల్స్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ముజఫర్ పూర్ జిల్లా భేలాలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఫ్యాక్టరీలో భారీ శబ్దంతో పేలుడు సంభవించగా.. కొద్దిసేపటికే బాయిలర్ నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సుమారు 5 కిలోమీటర్ల దూరం వరకూ పేలుడు శబ్ధం వినిపించిందంటే.. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఐదుగురు మృతి.. పలువురికి గాయాలు
కాగా.. ఈ పేలుడు సంభవించిన సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న వర్కర్స్ లో ఐదుగురు మృతి చెందగా.. మరికొందరికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. నూడుల్స్ ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలు కూడా దెబ్బతిన్నాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన కార్మికులను ఆస్పత్రికి తరలించి.. చికిత్స చేయిస్తున్నారు. ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడానికి గల ప్రధాన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Next Story