Wed Jan 28 2026 13:21:01 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీనగర్ లో ఘోర ప్రమాదం.. నదిలో పడి నలుగురు చిన్నారుల దుర్మరణం
జమ్ము కాశ్మీర్ లో పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు

జమ్ము కాశ్మీర్ లో పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. పడవ బోల్తా ఘటనలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి ఎక్కువ మందిని తీసుకెళ్లడమే కారణమని భావిస్తున్నారు. జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ సమీపంలో జీలం నదిలో పాఠశాల పిల్లలను తీసుకెళుతున్న పడవ బోల్తా పడటంతో నలుగురు పిల్లలు మరణించారు. పన్నెండు మంది చిన్నారులను వెంటనే స్థానికులు రక్షించగలిగారు. కొందరు స్థానికులు కూడా ఈ పడవలో ప్రయాణిస్తున్నారు. కొందరు గల్లంతయినట్లు చెబుతున్నారు.
స్కూలు పిల్లలను...
గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ పడవ బోల్తా ఘటనలో నదిలో మునిగిపోయి రక్షించిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గండ్బాల్ నుంచి శ్రీనగర్ లోని బట్వారాకు పిల్లలను తీసుకెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వర్షం కారణంగా జీలం నది ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పాటు సామర్థ్యానికి మించి పడవలో మనుషులను ఎక్కించుకోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

