Thu Sep 19 2024 01:28:08 GMT+0000 (Coordinated Universal Time)
జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాక్.. ఉక్రెయిన్ కు సాయం చేయాలంటూ ట్వీట్లు
ఆదివారం ఉదయం ఆగంతకులు జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు. అనంతరం ఆయన ఖాతా నుంచి రష్యా, ఉక్రెయిన్ లకు..
న్యూ ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైంది. ఆదివారం ఉదయం ఆగంతకులు జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు. అనంతరం ఆయన ఖాతా నుంచి రష్యా, ఉక్రెయిన్ లకు సాయం చేయాలంటూ వరుస ట్వీట్లు చేశారు. జేపీ నడ్డా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని గుర్తించిన ప్రభుత్వ వర్గాలు వెంటనే చర్యలు ప్రారంభించాయి. ఆయన ఖాతా నుంచి వెలువడిన ట్వీట్లను తొలగించి, అకౌంట్ ను పునరుద్ధరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Also Read : కష్టాలను భరించలేక.. కుటుంబం ఆత్మహత్య
"రష్యా ప్రజలతో నిలబడండి. ఇప్పుడు క్రిప్టోకరెన్సీ విరాళాలను స్వీకరిస్తున్నారు. బిట్కాయిన్ – ఎథెరియం" అంటూ ఆగంతకులు ట్వీట్ లో పేర్కొన్నారు. ఇలా వరుసగా పలు ట్వీట్లు చేశారు. కాగా.. జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిన విషయం తమ దృష్టికి వచ్చిందని, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ దానిని పరిశీలిస్తోందని ఐటీ మంత్రిత్వశాఖ అధికారి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు.
Next Story