Fri Dec 05 2025 13:43:40 GMT+0000 (Coordinated Universal Time)
Shanmukh : పోలీసుల అదుపులో బిగ్‌బాస్ ఫేం షణ్ముఖ్ బ్రదర్స్
బిగ్‌బాస్ ఫేంషణ్ముఖ్ పోలీసుల అదుపులో ఉన్నారు. గంజాయితో పట్టుబడటంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

బిగ్‌బాస్ ఫేం షణ్ముఖ్ పోలీసుల అదుపులో ఉన్నారు. గంజాయితో పట్టుబడటంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ వేర్వేరు కేసుల్లో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టనున్నారు. బిగ్‌బాస్ ఆరో సీజన్ లో షణ్ముఖ్ అందరికీ పరిచయమయ్యాడు. యూట్యూబర్ గా ఫేమస్ అయిన షణ్ముఖ్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు. ఆ సీజన్ లోనూ షణ్ముఖ్ పులిహోర కలిపేందుకు ప్రయత్నించాడు.
ఒకరితో వివాహం నిశ్చయమై...
తాజాగా షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ కు ఒక యువతితో వివాహం నిశ్చయమైంది. ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే వధువు తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో వాయిదా పడింది. అయితే ఆ యువతితో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంపత్ వినయ్ వివాహం వాయిదా పడటంతో వేరొక యువతితో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన ఎంగేజ్ మెంట్ అయిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంపత్ వినయ్ కోసం పోలీసులు అతని ఫ్లాట్‌కు వెళ్లగా అక్కడ షణ్ముఖ్ డ్రగ్స్ తో పట్టుబడటంతో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
Next Story

