Thu Jul 07 2022 07:27:18 GMT+0000 (Coordinated Universal Time)
విషాదం.. మరో మోడల్ బలవన్మరణం

బెంగాలీ చిత్రపరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే పల్లవి డే అనే నటి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. రెండ్రోజుల క్రితమే నటి, మోడల్ బిదిషా మజుందార్ ఆత్మహత్య చేసుకుంది. బిదీషా మరణంతో బెంగాలీ వినోదరంగమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తాజాగా మరో బెంగాలీ మోడల్ కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఆమె బిదీషా స్నేహితురాలే. మోడల్ మంజూషా నియోగి, బిదీషా మజుందార్ లు స్నేహితురాళ్లు. తన స్నేహితురాలు ఆత్మహత్య చేసుకోవడాన్ని భరించలేక మంజూషా కూడా ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
బిదీషా మృతిని జీర్ణించుకోలేక.. తీవ్ర మనస్తాపానికి గురైన మంజూషా తన అపార్ట్ మెంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బిదీషా మరణవార్త తెలిసినప్పటి నుంచి తమ కుమార్తె మానసికంగా కుంగిపోయిందని, అదే పనిగా బిదీషా గురించి మాట్లాడుతూ.. ఆ ధ్యాసలోనే ఉండిపోయిందని మంజూషా తల్లి తెలిపింది. మంజూషా ఆత్మహత్య పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story