Fri Dec 05 2025 23:23:02 GMT+0000 (Coordinated Universal Time)
ప్రముఖ సింగర్ పై కాల్పులు
సింగర్ పై కాల్పులు ఎవరు చేశారు ? దీనివెనుక ఎవరున్నారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రముఖ భోజ్ పురి సింగర్ నిషా ఉపాధ్యాయ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో నిర్వహించిన ఓ లైవ్ షో లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల్లో సింగర్ నిషా ఎడమ కాలికి బుల్లెట్ గాయమైంది. వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం నిషా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ కాల్పుల ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. సంఘటన గురించి తమకు సమాచారం మాత్రమే అందిందని, ఎలాంటి ఫిర్యాదు ఎవరూ చేయలేదని తెలిపారు. సింగర్ పై కాల్పులు ఎవరు చేశారు ? దీనివెనుక ఎవరున్నారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిషా ఉపాధ్యాయ బీహార్కు చెందిన ప్రఖ్యాత గాయని. సరన్ జిల్లాలోని గౌర్ బసంత్ ఆమె స్వస్థలం. ప్రస్తుతం పాట్నాలో నివాసం ఉంటూ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇస్తుంది. లే లే ఆయే కోకా కోలా, నవకర్ మంత్ర, ధోలిదా ధోల్ రే వగడ్, హసి హసి జాన్ మారెలా లాంటి హిట్ సాంగ్స్తో నిషా ఉపాధ్యాయ ఫేమస్ అయింది.
Next Story

