Fri Sep 13 2024 01:10:47 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం.. బల్లిపై నలుగురు అత్యాచారం
మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు నలుగురు నిందితుల్లో ఒకరి మొబైల్ ను పరిశీలించడంతో ఈ విషయం బయటికొచ్చింది. భారీ బల్లిపై సామూహిక
ముంబై : బల్లిపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది. గోథానే గ్రామ సమీపంలోని సహ్యాద్రి టైగర్ రిజర్వ్ లో నలుగురు వేటగాళ్లు ఓ బెంగాల్ మానిటర్ లిజర్డ్ పై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు.. ఆ ఘటనంతటినీ సెల్ఫోన్లో చిత్రీకరించారు. గభా ప్రాంతంలోని టైగర్ రిజర్వ్ కోర్ జోన్లోకి ప్రవేశించిన నిందితులైన వేటగాళ్లు ఈ దారుణ నేరానికి పాల్పడ్డారు. నిందుతులు సందీప్ తుక్రామ్, పవార్ మంగేశ్, జనార్దన్ కామ్టేకర్, అక్షయ్ సునీల్ లుగా గుర్తించారు.
మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు నలుగురు నిందితుల్లో ఒకరి మొబైల్ ను పరిశీలించడంతో ఈ విషయం బయటికొచ్చింది. భారీ బల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దృశ్యాలను తమ మొబైల్ లో చిత్రీకరించారు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో అడవిలో తిరుగుతున్న వీరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కొంకణ్ నుంచి కొల్హాపూర్ చందోలి గ్రామానికి చెందిన వారని, వేట కోసం అడవిలోకి చొరబడినట్లు గుర్తించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి చర్యలు తీసుకుంటామన్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం బెంగాల్ మానిటర్ లిజర్డ్ అరుదైన జాతి. నేరం రుజువైతే నిందితులకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది.
Next Story