Fri Dec 05 2025 22:47:55 GMT+0000 (Coordinated Universal Time)
Crime News :కోటి చోరీ ఈ క్రిమినల్ పనేనా? బత్తుల హైదరాబాద్ లో?
హర్డ్ కోర్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు

హర్డ్ కోర్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. పదిహేను రోజులవుతున్నా బత్తుల జాడ లేదు. అయితే అతను హైదరాబాద్ లో ఉన్నాడన్న అనుమానాలు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్ లోనే ఉంటూ దొంగతనాలకు పాల్పడుతున్నాడని భావిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి జైలుకు తరలిస్తుండగా బత్తుల ప్రభాకర్ ఒక డాబాలో టీ తాగడానికి ఆగిన తర్వాత తనకు టాయ్ లెట్ వస్తుందని చెప్పాడు. దీంతో ఎస్కార్ట్ పోలీసులు చేతికి ఉన్న ఒక బేడీని తొలగించి పంపారు. అయితే అక్కడి నుంచి బత్తుల ప్రభాకర్ పరారయ్యాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పది పోలీసు బృందాలు అన్ని రాష్ట్రాల్లో గాలిస్తున్నాయి.
బ్రిలియంట్ కళాశాలలో చోరీలో...
కానీ తాజాగా హైదరాబాద్ లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాలలో భారీ చోరీ జరిగింది. కోటి రూపాయల నగదు చోరీకి గురయింది. హైదరాబాద్ నగరం శివారులో ఉన్న అబ్దుల్లాపూర్ మెట్ లో బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాల ఉంది. అయితే కోటి రూపాయల నగదును చోరీకి గురికావడంతో ఈ చోరీకి పాల్పడింది బత్తుల ప్రభాకర్ అయి ఉండవచ్చేమోనని అనుమానిస్తున్నారు.బ్రలియంట్ కళాశాల ప్రాంగణంలో ఉన్న సీసీ టీవీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వేలిముద్రలను సేకరించారు. అయితే బత్తుల ప్రభాకర్ కేవలం ఇంజినీరింగ్ కళాశాలలను మాత్రమే టార్గెట్ చేసే అలవాటు ఉండటం, అతను పోలీసుల నుంచి తప్పించుకోవడంతో ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
చోరీ చేసే స్టయిల్...
బత్తుల ప్రభాకర్ కు ప్రత్యేక స్టయిల్ ఉంది. అతని క్రిమినల్ రికార్డు కూడా ఇదే చెబుతుంది. గురువారం మాత్రమే చోరీ చేస్తాడు. శని, ఆదివారాలు మాత్రం ఫుల్లు ఎంజాయ్ చేస్తాడు. కనీసం పది లక్షలు దొరుకుతాయని అంచనా వేసి ముందుగా రెక్కీ చేసిన తర్వాతనే చోరీలు చేయడం ప్రభాకర్ లో ఉన్న మరో స్పెషాలిటీ అని పోలీసులు తెలిపారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో చోరీ చేయడం బత్తుల ప్రభాకర్ కు అలవాటు. ఇప్పుడు బ్రిలియంట్ కళాశాలలో చోరీకి గురయింది గురువారం కావడంతో పాటు ఇంజినీరింగ్ కళాశాల కావడంతో బత్తులపై అనుమానాలు బలపడుతున్నాయి. దీంతో ఇప్పుడు తెలంగాణ పోలీసులు కూడా బత్తుల ప్రభాకర్ ఈ చోరీకి పాల్పడ్డాడన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.శని, ఆదివారాలు చోరీ చేసిన సొమ్ముతో ఎంజాయ్ చేస్తాడు. అందుకే పబ్ లు, బార్ల వద్ద పోలీసులు నిఘా పెంచినట్లు సమాచారం.
Next Story

