Sat Dec 06 2025 00:47:14 GMT+0000 (Coordinated Universal Time)
పోలీసుల కన్నుగప్పి బత్తుల పరార్.. ఈసారి ఎవరికి మూడిందో?
కరడు గట్టిన నేరగాడు బత్తుల ప్రభాకర్ తప్పించుకున్నాడు. పోలీసుల కళ్ల గప్పి పారిపోయాడు.

కరడు గట్టిన నేరగాడు బత్తుల ప్రభాకర్ తప్పించుకున్నాడు. పోలీసుల కళ్ల గప్పి పారిపోయాడు. బత్తుల ప్రభాకర్ ను తూర్పు గోదావరి జిల్లా దుద్దుకూరు పోలీసుల నుంచి బత్తుల ప్రభాకర్ తప్పించుకున్నాడు. ఒక హోటల్ వద్ద భోజనం చేయడానికి ఆగడంతో టాయ్ లెట్ కు వెళతానని చెప్పి బత్తుల ప్రభాకర్ తప్పించుకున్నాడు. బత్తుల ప్రభాకర్ కు ఎస్కార్ట్ గా ఇద్దరు పోలీసులు మాత్రమే ఉన్నారు. దీంతో బత్తుల ప్రభాకర్ సులువుగా తప్పించుకున్నాడు. బత్తుల ప్రభాకర్ తప్పించుకోవడంతో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. బత్తుల ప్రభాకర్ పై తమిళనాడు, కర్ణాటకలో 44 కేసుల్లో నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 42 కేసులు నమోదయి ఉన్నాయి. బత్తుల ప్రభాకర్ కోసం పది ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
హైదరాబాద్ పోలీసులకు దొరికి...
గతంలో హైదరాబాద్ పబ్ లో పోలీసులపై బత్తుల ప్రభాకర్ కాల్పులు జరిపాడు. ఇతాగాడి క్రిమినల్ రికార్డు చూసిన వారు ఎవరైనా ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్టార్ట్ గా పంపరని స్థానికులు అంటున్నారు. ఖరీదైన జీవితానికి అలవాటు పడిన ప్రభాకర్ అమ్మాయిలంటే తెగ పిచ్చి. తన జీవితంలో వంద మంది అమ్మాయిలను అనుభవించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అది మనసులో అనుకోలేదు. తన శరీరంపై వంద అంకెతో టాటూ వేయించుకున్నాడు. పోలీసులు బత్తుల ప్రభాకర్ ను అరెస్ట్ చేసి విచారించినప్పుడు ఈ విషయం బయటపడింది. మద్యం తాగడం, అమ్మాయిలతో తిరగడం అతని ప్రధాన హాబీలు. అతని మరో లక్ష్యం కూడా ఉంది. దొంగతనాలు చేసి మూడు కోట్ల రూపాయలు సాధించడం. ఈ రెంటికి సంబంధించి తన శరీరంపై టాటూలు వేయించుకున్నాడంటే అతని ఫ్యూచర్ ప్లాన్ ఎంటో తెలిసి పోలీసు అధికారులు ఆశ్చర్య పోయారు.
అనేక సార్లు జైలుకు వెళ్లి వచ్చి....
విశాఖ సెంట్రల్ జైలులో తనకు శత్రువుగా మారిన మరో నిందితుడిని హతమార్చేందుకు బత్తుల ప్రభాకర్ బీహార్ వెళ్లి మరీ మూడు గన్ లను కొని తీసుకు వచ్చాడు. అతనిని చంపేందుకు ప్లాన్ చేశాడు. అయితే రివాల్వర్ పేల్చడంలో అనుభవం లేకపోవడంతో ప్రాక్టీస్ కూడా చేయడం ప్రారంభించాడు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు సమీప ప్రాంతాల్లోకి వెళ్లి గుట్టల్లో రివాల్వర్ తో కాల్పులు జరిపాడు. గురి చూసి కాల్చడం నేర్చుకున్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ 2013 నుంచి చోరీలను ప్రారంభించి ఇప్పటి వరకూ అనేక సార్లు జైలు ఊచలు లెక్క పెట్టి మరీ వచ్చాడు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో అతనిపై క్రిమినల్ కేసులున్నాయి. పదకొండుచోట్ల చోరీలుచేసి రెండున్నర కోట్లు దొంగిలించాడు. అంటే ప్రభాకర్ ఏ రేంజ్ లో ఆలోచిస్తాడో అర్థం చేసుకోవచ్చు. చిల్లర దొంగ కాదు. హార్డ్ కోర్ క్రిమినల్. వచ్చిన డబ్బు మొత్తాన్ని తన పేరు మీద పైసా ఉంచుకోరు. తన జిగిరీ దోస్త్ బ్యాంక్ ఖాతాలో వేస్తాడు.
విలాసవంతమైన జీవితం...
మూడేళ్లుగా పోలీసుల కన్నుగప్పి తిరుగుతూ విలాసవంతమైన జీవితం గడుపుతున్న బత్తుల ప్రభాకర్ ను హైదరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. బత్తుల ప్రభాకర్ కు ప్రత్యేక స్టయిల్ ఉంది. గురువారం మాత్రమే చోరీ చేస్తాడు. శని, ఆదివారాలు మాత్రం ఫుల్లు ఎంజాయ్ చేస్తాడు. కనీసం పది లక్షలు దొరుకుతాయని అంచనా వేసి ముందుగా రెక్కీ చేసిన తర్వాతనే చోరీలు చేయడం ప్రభాకర్ లో ఉన్న మరో స్పెషాలిటీ అని పోలీసులు తెలిపారు. గురువారం చోరీ అదీ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిందంటే అది ప్రభాకర్ పనేనని పోలీస రికార్డు లు చెబుతున్నాయి. కరడు గట్టిన ఈ నేరగాడ్ని పోలీసులు పట్టుకున్నప్పటికీ అతను మళ్లీ తప్పించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో కేసుల నిమిత్తం తీసుకు వెళ్లి కోర్టు నుంచి జైలుకు తరలిస్తుండగా తప్పించుకుని పరారయ్యాడు. పోలీసుల వైఫల్యం అని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. బత్తుల ప్రభాకర్ కోసం డాగ్ స్క్కాడ్ తో పాటు పోలీసు బృందాలు కూడా గాలిస్తున్నాయి. ఏపీ డీజీపీ కూడా బత్తుల ప్రభాకర్ పోలీసుల కన్నుగప్పి తప్పించుకోవడంపై సీరియస్ అయినట్లు తెలిసింది.
Next Story

