Fri Dec 05 2025 20:48:56 GMT+0000 (Coordinated Universal Time)
Bathula Prabhakar : నెల రోజులయింది.. బత్తుల ప్రభాకర్ ఇంకా చిక్కలేదేమిటో?
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ ఇంకా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుతున్నాడు.

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ ఇంకా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుతున్నాడు. ఈరోజుకు బత్తుల ప్రభాకర్ తప్పించుకుని నెల రోజులయింది. బత్తుల ప్రభాకర్ కోసం పది బృందాలు నెల రోజుల నుంచి గాలిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. బత్తుల ప్రభాకర్ ఎస్కార్ట్ పోలీసుల నుంచి గత నెల 22వ తేదీన తప్పించుకున్నాడు. ఇప్పటికి నెల రోజులు గడుస్తున్నా బత్తుల ప్రభాకర్ ను పోలీసులు పట్టుకోలేకపోతున్నారంటే పోలీసుల కన్ను గప్పి ఎలా తిరుగుతున్నాడన్నది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. బత్తుల ప్రభాకర్ ను తూర్పు గోదావరి జిల్లా దుద్దుకూరు పోలీసుల నుంచి బత్తుల ప్రభాకర్ తప్పించుకున్నాడు. ఒక హోటల్ వద్ద భోజనం చేయడానికి ఆగడంతో టాయ్ లెట్ కు వెళతానని చెప్పి బత్తుల ప్రభాకర్ తప్పించుకున్నాడు.
క్రిమినల్ రికార్డులు...
బత్తుల ప్రభాకర్ కు ఎస్కార్ట్ గా ఇద్దరు పోలీసులు మాత్రమే ఉన్నారు. దీంతో బత్తుల ప్రభాకర్ సులువుగా తప్పించుకున్నాడు. క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పై తమిళనాడు, కర్ణాటకలో దాదాపు నలభైకి పైగానే కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 42 కేసులు నమోదయి ఉన్నాయి. బత్తుల ప్రభాకర్ కోసం పది ప్రత్యేక బృందాలు ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. అయితే బత్తుల ఒకసారి తప్పించుకుంటే అంత సులువుగా చెప్పడని క్రిమినల్ రికార్డులు చెబుతున్నాయి. బత్తుల ప్రభాకర్ తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు వెళ్లి ఉంటాడని అనుమానించి అక్కడకు వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో గాలిస్తూనే ఉన్నారు. అయినా బత్తుల జాడ ఇంత వరకూ లేదు.
సాంకేతికంగా...
బత్తుల ప్రభాకర్ ఫోన్ వాడకపోవడం వల్లనే అతనిని సాంకేతికంగా పట్టుకోవడం సాధ్యం కావడం లేదని పోలీసు వర్గాలు తెలిపాయి. బత్తుల ప్రభాకర్ మారు వేషాలు వేసి పోలీసుల కళ్లు గప్పడంలో దిట్ట. అతని చేతులకున్న బేడీలను కూడా తొలగించుకునేందుకు ఎక్కడ ప్రయత్నించారన్న కోణంలో కూడా ప్రయత్నిస్తున్నారు. బత్తుల ప్రభాకర్ కు సన్నిహితంగా ఉన్న వారిని కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినా అతని ఆచూకీ లభించలేదు. చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ 2013 నుంచి చోరీలను ప్రారంభించి ఇప్పటి వరకూ అనేక సార్లు జైలు ఊచలు లెక్క పెట్టి మరీ వచ్చాడు. లక్షలు దొరుకుతాయంటేనే అతను చోరీలకు పాల్పడతాడు. పోలీసులు మాత్రం అతని కోసం మఫ్టీల్లో వెతుకుతున్నారు. బత్తుల ఎప్పుడు దొరుకుతారన్నది ఇంకా తెలియరాలేదు.
Next Story

