Sat Sep 07 2024 12:09:29 GMT+0000 (Coordinated Universal Time)
ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసులు దాడి
బంజారాహిల్స్ ఆఫ్టర్ 9 పబ్ లో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.
బంజారాహిల్స్ ఆఫ్టర్ 9 పబ్ లో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.నిబంధనలకు విరుద్ధం గా నడుస్తుండటానికి గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. కస్టమర్లను ఆకర్షడానికి వేరే రాష్ట్రం నుండి యువతులను తీసుకువచ్చి పబ్ లో అసభ్యకరమైన డాన్సులు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
యువతులతో డ్యాన్స్‌లు...
దీంతో నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఆఫ్టర్ 9 పబ్బులో డాన్స్ చేస్తున్న యువతీ యువకులను అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ అర్ధరాత్రి వరకు బార్, పబ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఈ పబ్ పై దాడి చేసి దానిని మూసివేయించారు.
Next Story