Sat Sep 07 2024 11:21:45 GMT+0000 (Coordinated Universal Time)
కారు రివర్స్.. ఆ చిన్నారి ప్రాణం తీసింది
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఒక బాలుడు మృతి చెందిన ఘటన కన్నీరు తెప్పిస్తుంది.
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఒక బాలుడు మృతి చెందిన ఘటన కన్నీరు తెప్పిస్తుంది. వెనక చూసుకోకుండా కారును రివర్స్ చేస్తుండగా బాలుడు దాని కింద పడి చనిపోయాడు. ఎల్బీనగర్ కు సమీపంలో మన్సూరాబాద్ లో ఈ ఘటన జరిగింది. మన్సూరాబాద్ లోని కాస్మాపాలిటన్ కాలనీలోని ఒక అపార్ట్ మెంట్ లో బాలుడు దుర్మరణం చెందాడు.
ఒక అపార్ట్ మెంట్ లో...
కాస్మోపాలిటన్ కాలనీలోని ఒక అపార్ట్ మెంట్ లో లక్ష్మణ్ వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. జహీరాబాద్ నుంచి వచ్చిన లక్ష్మణ్ కుటుంబం ఏడాది నుంచి ఈ అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా పనిచేస్తుంది. లక్ష్మణ్ కు ఇద్దరు పిల్లలు. కారు కడిగేందుకు లక్ష్మణ్ అపార్ట్ మెంట్ లోని తన యజమాని కారును రివర్స్ చేస్తుండగా సాత్విక్ అనే బాలుడు మృతి చెందాడు. తండ్రి కారు రివర్స్ చేస్తుండటం గమనించని ఆ బాలుడు అక్కడే ఉండగా, లక్ష్మణ్ కారు వేగంగా వెనక్కు తిప్పగా దాని కింద పడి చనిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story