Sat Aug 13 2022 06:53:21 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కోర్టుకు విధ్వంసం నిందితులు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో విచారణ ముమ్మరంగా సాగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆవుల సుబ్బారావును నేడు కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు. ఆవులతో పాటు మరో ఏడుగురు నిందితులను కూడా నేడు కోర్టులో హాజరుపర్చే అవకాశముంది. గత కొద్ది రోజులుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆవుల సుబ్బారావును విచారించారు. ఈ విచారణలో అనేక విషయాలు వెల్లడయ్యాయి.
ఆవులతో పాటు ఏడుగురు....
ఆవుల సుబ్బారావు విధ్వంసానికి పాల్పడినట్లు టాస్క్ ఫోర్స్ విచారణలో వెల్లడయింది. ఒకరోజు ముందుగానే ఆవుల సుబ్బారావు సికింద్రాబాద్ కు చేరుకున్నారని తేలింది. ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని విచారణలో వెల్లడయింది. ఏపీ తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా సుబ్బారావు అకాడమీ శాఖలను నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. సుబ్బారావుతో పాటు ఏడుగురికి వైద్యపరీక్షలు పూర్తయ్యాయి. దీంతో నేడు కోర్టులో వారిని హాజరు పర్చే అవకాశముంది.
Next Story