Wed Jun 29 2022 07:13:51 GMT+0000 (Coordinated Universal Time)
విధ్వంసానికి ఆవులే కారణం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంస కేసులో ఆవుల సుబ్బారావు, శివలను ప్రధాన నిందితులుగా చేర్చారు. రిమాండ్ రిపోర్ట్ లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టారని పేర్కొన్నారు. ఆయన అకాడమికి చెందిన శివ అభ్యర్థులకు పెట్రోలు, కర్రలు వంటివి సమకూర్చారని కూడా తెలిపారు. హకీంపేట సోల్జర్స్ గ్రూప్ లో ఆవుల సుబ్బారావు రైల్వే ఘటనకు మద్దతు ప్రకటించారు.
రెచ్చగొట్టి....
ఆర్మీ అభ్యర్థులకు ఫోన్ చేసి ఆవుల సుబ్బారావు వారిని రెచ్చగొట్టారని పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ డిఫెన్స్ అకాడమీలో స్టూడెంట్ గా ఉన్న ప్రృథ్వీరాజ్ ను గుర్తించారు. ప్రృథ్వీరాజ్ ను ఏ2 గా ఈ కేసులో చేర్చారు. సికింద్రాబాద్ విధ్వంసం కేసులో ఇప్పటి వరకూ 55 మందిని అరెస్ట్ చేశారు. మరో ఎనిమిది మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ విధ్వంసం ఘటనలో ఎక్కువగా సాయి డిఫెన్స్ అకాడమీ విద్యార్థులే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Next Story