Fri Dec 05 2025 18:55:22 GMT+0000 (Coordinated Universal Time)
మైనర్ పై ఆటో డ్రైవర్ అత్యాచారం..
బాలిక పాఠశాలకు వెళ్తుండగా రూ.50 ఆశ చూపించాడు. తనతో వస్తే రూ.50 ఇస్తానని నమ్మించిన ఆటోడ్రైవర్..

మేడ్చల్ : ఆడపిల్లల రక్షణకై ఎన్ని చట్టాలు తెచ్చినా.. రేప్ కేసుల్లో నిందితులకు ఎన్ని కఠిన శిక్షలు పడినా.. ఎంతమందిని ఎన్ కౌంటర్ చేసినా.. కామాంధుల ఆలోచనల్లో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. ఆడపిల్ల కనపడటమే పాపం.. ఆమె జీవితాన్ని చిదిమేస్తున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో మరో దారుణం జరిగింది. అభం శుభం తెలియని బాలిక(11)పై వెంకటయ్య అనే ఆటోడ్రైవర్ అత్యాచారం చేశాడు.
బాలిక పాఠశాలకు వెళ్తుండగా రూ.50 ఆశ చూపించాడు. తనతో వస్తే రూ.50 ఇస్తానని నమ్మించిన ఆటోడ్రైవర్.. బాలికపై తమ కామవాంఛ తీర్చుకున్నాడు. ఈ ఘటన మార్చి 31వ తేదీన జరిగింది. విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసినా.. కుటుంబం పరువు పోతుందన్న ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బాలిక చదువుతున్న పాఠశాలలో టీచర్ సలహా మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story

