Sun Dec 08 2024 20:50:42 GMT+0000 (Coordinated Universal Time)
బాలుడిని చంపేసిందని పెంపుడు కుక్కను చంపిన కుటుంబ సభ్యులు
తాండూరులో దారుణం చోటు చేసుకుంది. ఐదు నెలల పసికందుపై పెంపుడు కుక్క దాడి చేయడంతో ఆ బాలుడు మరణించాడు
తాండూరులో దారుణం చోటు చేసుకుంది. ఐదు నెలల పసికందుపై పెంపుడు కుక్క దాడి చేయడంతో ఆ బాలుడు మరణించాడు. తాండూరు పట్టణంలోని బసవేశ్వరనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పసికందుపై పెంపుడు కుక్క దాడి చేయడంతో ఆ బాలుడు మరణించడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహానికి లోనయ్యారు.
పెంపుడు కుక్కను...
వెంటనే పెంపుడు కుక్కను చంపేశారు. బాలుడి మరణానికి కారణమయిందని భావించి పెంపుడు కుక్కను కుటుంబసభ్యులు చంపేయడం ఇప్పుడు పట్ణణంలో చర్చనీయాంశంగా మారింది. కొందరు గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశాలున్నాయి.
Next Story