Mon Mar 16 2026 23:24:00 GMT+0530 (India Standard Time)
నగరంలో నరబలి..?
సనత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. అమావాస్య రోజున ఎనిమిదేళ్ల ఏళ్ల బాలుడు అబ్దుల్ వాహిద్ మృతి సంచలనంగా మారింది

సనత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. అమావాస్య రోజున ఎనిమిదేళ్ల ఏళ్ల బాలుడు అబ్దుల్ వాహిద్ మృతి చెందడంతో ఒక హిజ్రా ఇంటిపై దాడి చేశారు.. బాలుని ఓ హిజ్రా బలి ఇచ్చినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. హిజ్రా ఇంటిపై స్థానికులు దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇంటిపై దాడి చేయడంతో...
సనత్ నగర్ లోని అల్లాదున్ కోటి ఏరియాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హిజ్రా ఇంటిని స్థానికులు ధ్వంసం చేశారు. బాలుని మృతదేహాన్ని సమీపంలోని నాలాలో గుర్తించారు. అయితే సమచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే బాలుడి మృతికి హిజ్రాయే కారణమా? మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Next Story

