Sat Mar 07 2026 17:31:44 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ లో దారుణం... యువతి మృతదేహం కలకలం
రాజేంద్ర నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

రాజేంద్ర నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అత్తాపూర్ లోని ఒక అపార్ట్ మెంట్ లో యువతి మృతదేహం కలకలం రేపింది. స్థానికులు ఇచ్చని సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అత్తాపూర్ చింతల్ మెట్ లోని ఒక అపార్ట్ మెంట్ లో ఈ దుర్ఘటన జరిగింది.
పోలీసుల దర్యాప్తులో....
యువతి ఫ్యాన్ కు ఉరివేసుకుని కన్పించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. డాగ్ స్క్కాడ్, క్లూస్ టీం రంగంలోకి దిగి దద్యాప్తు చేస్తున్నారు. యువతి హత్యా? ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును మొదలు పెట్టారు. యువతి మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టంకు తరలిస్తున్నారు.
Next Story

