Fri Mar 20 2026 16:48:47 GMT+0530 (India Standard Time)
రన్నింగ్ ట్రైన్లో మహిళకు నిప్పంటించిన దుండగుడు
కేరళ కోజికోడ్‌లో దారుణం చోటు చేసుకుంది. రన్నింగ్ ట్రైన్లో మహిళకు ఒక వ్యక్తి నిప్పంటించాడు

కేరళ కోజికోడ్‌లో దారుణం చోటు చేసుకుంది. రన్నింగ్ ట్రైన్లో మహిళకు ఒక వ్యక్తి నిప్పంటించాడు. ఈ ఘటనలో మహిళ చిన్నారితో సహా ముగ్గురు మరణించారు. చిన్నారి వయసు ఏడాదిగా తెలుస్తోంది. దీంతో తోటి ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును ఆపినా ప్రయోజనం లేకపోయింది.
ముగ్గురు మృతి
అయితే మరణించిన మహిళ ఎవరు? నిప్పంటించిన దుండగుడు ఎందుకీ దారుణానికి పాల్పడ్డాడు? అనే విషయాలు తెలియాల్సి వస్తుంది. వెంటనే ప్రయాణికులు అందించిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

