Wed Jan 21 2026 23:15:12 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : బిర్యానీ బాగా లేదన్నందుకు వెయిటర్లు చితకబాదారు
హైదరాబాద్ అబిడ్స్ గ్రాండ్ హోటల్ లో దారుణం జరిగింది. బిర్యానీ బాగా లేదని అన్నందుకు వెయిటర్లు 12 మంది యువకులను కొట్టారు

హైదరాబాద్ అబిడ్స్ గ్రాండ్ హోటల్ లో దారుణం జరిగింది. బిర్యానీ బాగా లేదని అన్నందుకు వెయిటర్లు 12 మంది యువతీ యువకులను చితక బాదారు. వీరిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు. బిర్యానీలో మటన్ సరిగా ఉడకలేదన్నందుకు వెయిటర్లు కర్రలతో దాడికి దిగిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
నిన్న న్యూ ఇయర్ వేడుకలు...
నిన్న న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఈ ఘర్షణ జరిగింది. ఈ కేసులో హోటల్ యజమానితో పాటు పది మంది వెయిటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. దెబ్బతిన్న యువకులంతా ధూల్‌పేట్ కు చెందిన వారు కావడంతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసు అధికారికి ఫోన్ చేసి హోటల్ ను బంద్ చేయించాలని ఆదేశించారు.
Next Story

