Thu Mar 19 2026 07:04:14 GMT+0530 (India Standard Time)
Road Accident : పెళ్లి బరాత్‌లో విషాదం.. దూసుకొచ్చిన ట్రక్కు... ఐదుగురు మృతి.. మరికొందరు కూడా
మధ్యప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి ఊరేగింపుపై ఒక ట్రక్కు దూసుకెళ్లడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు

మధ్యప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి ఊరేగింపుపై ఒక ట్రక్కు దూసుకెళ్లడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. మధ్యప్రదేశ్ లోని రాయ్‌సేన్ జిల్లాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. నిన్న రాత్రి ఘాట్ పిపారియా గ్రామంలో భోపాల్ - జబల్పూర్ జాతీయ రహదారిపై పెళ్లి ఊరేగింపు వెళుతుంది. అయితే ఒక్కసారిగా వచ్చిన ట్రక్కు అదుపు తప్పి పెళ్లి ఊరేగింపుపై దూసుకు రావడంతో ఐదుగురు మరణించారు.
మృతుల సంఖ్య మరింత...
మరో పదకొండు మంది గాయపడ్డారు. గాయపడిన వారిని పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. మృతదేహాలతో అక్కడ బీభత్సమైన వాతావరణం నెలకొంది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరకణించిన వారి కుటుంబాలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నాలుగు లక్షలరూపాయలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించింది. గాయపడిన వారికి యాభై వేలు పరిహారం ఇవ్వనుంది.
Next Story

