Wed Mar 18 2026 09:00:23 GMT+0530 (India Standard Time)
ఫోన్ మాట్లాడుతుందని.. హత్య
ముషీరాబాద్ లో దారుణం జరిగింది. సెల్ ఫోన్ మాట్లాడుతుందని కూతరిని పినతండ్రి చంపిన ఘటన సంచలనంగా మారింది

ముషీరాబాద్ లో దారుణం జరిగింది. సెల్ ఫోన్ మాట్లాడుతుందని కూతరిని పినతండ్రి చంపిన ఘటన సంచలనంగా మారింది. ఫోన్ మాట్లాడవద్దంటూ ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోక పోవడంతో తన కుమార్తె ఉన్నీసాను తండ్రి సాదిక్ గొంతు నులిమి చంపేశాడు. ఉన్నిసా వయసు పదిహేడు సంవత్సరాలు.
రెండో వివాహం ....
సాదిక్ ఉన్నీసా తల్లిని రెండో వివాహం చేసుకున్నాడు. ముషీరాబాద్ లోని బాకారంలో ఈ ఘటన జరిగింది. కుమార్తెను చంపిన సాదిక్ తర్వాత నేరుగా ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

