Fri Sep 13 2024 16:03:33 GMT+0000 (Coordinated Universal Time)
దారుణ హత్య... డబ్బుల కోసమేనా?
హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఒక వ్యాపారవేత్త హత్యకు గురయ్యాడు.
హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఒక వ్యాపారవేత్త హత్యకు గురయ్యాడు. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేసిన పోలీసులు హత్య కేసుగా దర్యాప్తును ప్రారంభించారు. విజయభాస్కర్ అనే వ్యాపారి తన కారులోనే హత్యకు గురయ్యాడని తెలుస్తోంది. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద కమేళాలో ఆర్మీకి చెందిన బహిరంగ ప్రదేశంలో కారులో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆస్తి వివాదాలు...
విజయభాస్కర్ కు ఆస్తుల విషయమై బంధువులతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. మృతదేహంపై గాయాలు కూడా ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. నోరు, ముక్కు వద్ద గాయాలు, చెవి వెనక భాగం నుంచి రక్తం కారడం వంటి వాటిని పోలీసులు గుర్తించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విజయభాస్కర్ అల్వాల్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.
Next Story