Sat Feb 21 2026 10:03:19 GMT+0530 (India Standard Time)
సిద్ధిపేట జిల్లాలో కాంగ్రెస్ నేత దారుణ హత్య
సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. కాంగ్రెస్ నేత హత్యకు గురయ్యాడు

సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని దుబ్బాక మున్సిపాలిటీ పరిధి చెల్లాపూర్ వార్డుకు చెందిన వంగ బాల్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆయనను రాజక్క పేట గ్రామ శివారులో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. ఎవరు? ఎందరు? ఈ హత్యలో పాల్గొన్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు.
పాత కక్ష్యలున్నాయా?
బాల్ రెడ్డి పై దాడి చేసి హత్య చేయడంతో పాత కక్ష్యలు ఏమన్నా ఉన్నాయా? క భూ తగాదాలు కారణమా అనే కోణంలో విచారిస్తున్నారు. బాల్ రెడ్డికి ఎవరైన శత్రువులు ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగిన విషయం స్థానికులకు తెలవడంతో పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకొని హత్య జరిగిన విధానాన్ని చూసి ఉలిక్కిపడ్డారు. కాగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాల్ రెడ్డి హత్య దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

