Fri Dec 05 2025 10:50:24 GMT+0000 (Coordinated Universal Time)
మేడ్చల్ దారుణ హత్య
మేడ్చల్ లో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై హత్య జరిగింది

మేడ్చల్ లో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై హత్య జరిగింది. మేడ్చల్ బస్సు డిపోవద్ద జరిగిన ఈ హత్యతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. దారుణంగా చంపడంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఉమేష్ అనే వ్యక్తిని ఈరోజు సాయంత్రం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపేశారు.
అందరూ చూస్తుండగానే...
అయితే ఈ హత్యకు కారణాలు మాత్రం తెలియరాలేదు. కత్తులతో పొడవటంతో ఉమేష్ అక్కడికక్కడే మరణించారు. పోలీసులు ఉమేష్ తో వ్యక్తిగత కక్షలతోనే చంపారని పోలీసులు ప్రాధమికంగా నిర్ణయించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story

