Fri Oct 11 2024 08:39:07 GMT+0000 (Coordinated Universal Time)
అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే కుమార్తె ఆత్మహత్య
గదిలో మహాలక్ష్మి ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను కిందికి దించి భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా..
భద్రాచలం : టిఆర్ఎస్ నేత, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. పొద్దెక్కినా మహాలక్ష్మి గది నుంచి బయటికి రాకపోవడంతో.. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి గదిలోకి వెళ్లి చూశారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసిన కుటుంబ సభ్యులంతా నిర్ఘాంతపోయారు.
గదిలో మహాలక్ష్మి ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను కిందికి దించి భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న వైద్యులు.. మహాలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుమార్తె మరణవార్తతో తాటి వెంకటేశ్వర్లు వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. కుమార్తె మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోధించారు. కాగా.. మహాలక్ష్మి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన మహాలక్ష్మి ప్రస్తుతం పీజీ కోర్సు కోసం సిద్ధమవుతున్నారు.
Next Story