Tue Sep 10 2024 10:20:28 GMT+0000 (Coordinated Universal Time)
మద్యం మత్తు.. ఒక చిన్నారి ప్రాణం తీసింది
వీకెండ్ కావడంతో మద్యం తాగి కారు నడిపి ఒక చిన్నారిని బలిగొన్న సంఘటన హైదరాబాద్ లో జరిగింది
వీకెండ్ కావడంతో మద్యం తాగి కారు నడిపి ఒక చిన్నారిని బలిగొన్న సంఘటన హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ లోని గోల్కొండ పరిధిలోని ఇబ్రహీంబాగ్ లో ఒక కారు వేగంగా వచ్చి బైకును ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న తండ్రి గాయపడగా, చిన్నారి మరణించింది. వైఎస్సార్ కాలనీకి చెందిన రమేష్ తన కుమారుడు శౌర్యను తీసుకుని ఇబ్రహీంబాగ్ నుంచి ఇంటికి బైక్ పై వెళుతున్నాడు.
వేగంగా కారులో వచ్చి...
అదే సమయంలో మద్యం మత్తులో షేక్ పేట్ కు చెందిన శ్రీనాధ్ అనే యువకుడు తన కారుతో బైక్ ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో రమేష్ కు గాయాలయ్యాయి. బాలుడు శౌర్య మృతి చెందాడు. అయితే కారులో మద్యం బాటిల్స్ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. కారులో ఉన్న యువకులు పరారయ్యాడు. కారు నడిపిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story