Mon Jun 23 2025 03:29:15 GMT+0000 (Coordinated Universal Time)
RCBలో అరెస్టుల పర్వం.. నెక్స్ట్ ఎవరు?
జూన్ 4న ఎం.చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటకు సంబంధించి బెంగళూరు పోలీసులు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను అరెస్టు చేశారు

జూన్ 4న ఎం.చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటకు సంబంధించి బెంగళూరు పోలీసులు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను అరెస్టు చేశారు. ఆర్సిబి మార్కెటింగ్, రెవెన్యూ హెడ్ నిఖిల్ ను బెంగళూరు విమానాశ్రయంలో అడ్డుకున్నారు, ముంబైకి వెళుతుండగా అదుపులోకి తీసుకున్నారు. డిఎన్ఎ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద, డీసీపీ సెంట్రల్ డివిజన్ హెచ్.టి.శేఖర్‌తో సహా ఐదుగురు సీనియర్ పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. విచారణను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కు అప్పగిస్తున్నట్లు తెలిపారు.
Next Story