Fri Sep 13 2024 15:56:51 GMT+0000 (Coordinated Universal Time)
ఆస్ట్రేలియాలో అరవింద్ యాదవ్ అనుమానాస్పద మృతి
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌కు చెందిన అరవింద్ యాదవ్ ఆస్ట్రేలియాలో
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌కు చెందిన అరవింద్ యాదవ్ ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అరవింద్ ఉద్యోగరీత్యా భార్యతో కలిసి సిడ్నీలో స్థిరపడ్డాడు. అరవింద్ ఐదు రోజులుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు సిడ్నీలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని శవం సముద్రతీరంలో లభ్యమైంది. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా ఆ శవం అరవింద్‌దే అని తేలింది. సముద్రతీరంలో పోలీసులు అతని కారును కూడా గుర్తించారు.
షాద్ నగర్ బీజేపీ నేత అరటి కృష్ణ కుమారుడే అరవింద్ యాదవ్. 12 ఏళ్లుగా ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు.. 18 నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం తర్వాత భార్య, తల్లితో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు. ఆరు రోజుల క్రితమే తల్లి షాద్ నగర్ తిరిగి వచ్చింది. కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వచ్చేందుకు అరవింద్ కూడా సోమవారానికి టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు. అరవింద్ భార్య గర్భిణి. కారు వాష్ చేయించుకొని వస్తానని చెప్పిన అరవింద్ తిరిగి ఇంటికి రాలేదు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నివాసం ఉంటున్న 25ఏ డెర్మాంట్ స్ట్రీట్, హాసాల్ గ్రోవ్, ఎన్.ఎస్.డబ్ల్యూ 2761 లో షాద్ నగర్ పట్టణానికి చెందిన అరవింద్ గత సోమవారం ఇంటి నుండి బయలుదేరి వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు మొదట నమోదు చేశారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు సముద్రంలో అరవింద్ మృతదేహాన్ని గుర్తించారు. ఆస్ట్రేలియా పోలీసులు మృతుడి స్నేహితులు, సహా ఉద్యోగులను విచారిస్తున్నారు. అతని భార్య ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది.
Next Story