Sun Nov 03 2024 15:25:37 GMT+0000 (Coordinated Universal Time)
చెన్నై లో కాలి బూడిదైన ఏపీఎస్ఆర్టీసీ బస్సు
చెన్నైలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. చెన్నైలోని మాధవరం నుంచి
చెన్నైలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. చెన్నైలోని మాధవరం నుంచి ఏపీ లోని ఆత్మకూరుకు వస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు కాలి బూడిదైంది. అయితే బస్సులో ఉన్న ప్రయాణీకులకు ఏమీ అవ్వకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న 47 మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపోకు చెందిన ఈ బస్సు చెన్నైలోని రెడ్ హిల్స్ సమీపంలో కాలిపోయింది.
గత రాత్రి 9.30 గంటలకు చెన్నైలోని మాధవరం నుంచి బయల్దేరింది. రెడ్ హిల్స్ సమీపంలోకి రాగానే బస్సు ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. తర్వాత మంటలు కూడా రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. వెంటనే బస్సును ఆపివేశాడు. ప్రయాణికులంతా కిందికి దిగి బస్సుకు దూరంగా పరుగులు పెట్టారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. చూస్తుండగడానే బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకొని ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎవరికీ ఏమీ అవ్వకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకుంన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Next Story