Thu Mar 19 2026 18:11:16 GMT+0530 (India Standard Time)
ఆటోపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ.. మహిళ మృతి
ప్రమాద ఘటనను గ్రహించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఆటోడ్రైవర్ ను చికిత్స

గొల్లప్రోలు : ఆటోపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో మహిళ మృతి చెందింది. ఈ ప్రమాద ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. గొల్లప్రోలు మండలం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. చెందుర్తి-వజ్రకూటం మార్గమధ్యంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఆటోపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆటో డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి.
ప్రమాద ఘటనను గ్రహించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఆటోడ్రైవర్ ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, అధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనతో ఆ మార్గంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story

