Wed Mar 18 2026 19:12:50 GMT+0530 (India Standard Time)
గంజాయి కేసులో ఏపీ టిడిపి మహిళానేత అరెస్ట్
గుంటూరు జిల్లా నర్సారావుపేటకు చెందిన జాహ్నవిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు

గుంటూరు : గంజాయి స్మగ్లింగ్ కేసులో ఏపీ టిడిపి మహిళా నేత జాహ్నవిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా నర్సారావుపేటకు చెందిన జాహ్నవిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. 2013లో నమోదైన గంజాయి స్మగ్లింగ్ కేసులో జాహ్నవి హస్తం ఉందని గుర్తించారు సైబరాబాద్ పోలీసులు. గంజాయి తరలింపు లో NDPC Act లో నలుగురిపై కేసు నమోదవ్వగా ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడైన మరో వ్యక్తి శ్రీనివాస్ పరారీలో ఉండగా అతని కోసం గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story

