Sat Nov 02 2024 06:25:43 GMT+0000 (Coordinated Universal Time)
ముగ్గురు ఐపీఎఎస్లపై సస్పెన్షన్ వేటు
ఐపీఎస్ అధికారులు పి. సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నిలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
ముంబయికి చెందిన నటి అక్రమ అరెస్ట్ కేసులో ఏపీ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ కు దిగడం ఇప్పుడు పోలీసు వర్గాల్లో సంచలనంగా మారింది. ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ముగ్గురు అధికారులు నటి అక్రమ అరెస్ట్ కేసు వ్యవహారంలో ఉన్నట్లు ప్రాధమికంగా తేల్చడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఒకే కేసులో సస్పెన్షన్కు గురి కావడం ఇదే ప్రధమం.
ముంబయి నటి కేసులో...
మాజీ ఇంటలిజెన్స్ డీజీ పి. సీతారామాంజనేయులు, నాటి విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా, డిప్యూటీ పోలీసు కమిషనర్ విశాల్ గున్నిలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నటి స్వయంగా ఇబ్రహీం పట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వీరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రభుత్వం ఆదేశాలు లేకుండా వీరు హెడ్ క్వార్టర్స్ వదలి వెళ్లరాదని ఆదేశించారు. పోలీసులు ఈ కేసును ఇంకా విచారణ జరుపుతున్నారు.
Next Story