Sun Mar 15 2026 12:30:01 GMT+0530 (India Standard Time)
ఆ కారు ఎవరిది? ఇద్దరిని బలిగొన్న ఆ డ్రైవర్ ఎవరు?
మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తూ స్కూటీని ఢీకొట్టిన ఘటనలో మరో యువతి చికిత్స పొందుతూ మరణించింది

హైదరాబాద్ లో మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా గత శనివారం మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తూ స్కూటీని ఢీకొట్టిన ఘటనలో మరో యువతి చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లయింది.
మద్యం తాగి.....
చేెవెళ్ల నుంచి వస్తున్న కారు మొయినాబాద్ సమీపంలో స్కూటీని ఢీకొట్టింది. ఈ స్కూటీలో ప్రయాణిస్తున్న ప్రేమిక, సౌమ్య, అక్షర ఈ కారు ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటన లో ప్రేమిక అక్కడికక్కడే మృతి చెందింది. అక్షర కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తుండగా ఆ యువతి కూడా మరణించింది. సౌమ్య ప్రస్తుతం చికిత్స పొందుతుంది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఈ కారు ఎవరిది? డ్రైవర్ ఎవరు అన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Next Story

