Sat Sep 07 2024 10:23:37 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీనగర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
గడిచిన 36 గంటల్లో కాశ్మీర్ లోయర్ జరిగిన మూడు వేర్వేరు కాల్పుల్లో మొత్తం 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
శ్రీనగర్ లో గురువారం అర్థరాత్రి జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. గడిచిన 36 గంటల్లో కాశ్మీర్ లోయర్ జరిగిన మూడు వేర్వేరు కాల్పుల్లో మొత్తం 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ జిల్లా పంథా చౌక్ ప్రాంతంలో గోమందర్ మొహల్లా వద్ద గురువారం అర్థరాత్రి ఎన్ కౌంటర్ జరిగింది.
Also Read : ఏపీలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. 144 సెక్షన్ అమలు !
ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా.. వారిలో ఒకరిని సుహైల్ అహ్మద్ రాథర్ గా గుర్తించారు. సదరు ఉగ్రవాది జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవాడిగా పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్లోనే హతమైన మరో ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్న పోలీసులు.. హతమైన ఉగ్రవాదుల వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ పరిసర ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని కాశ్మీర్ పోలీస్ అధికారి విజయ్ కుమార్ ట్వీట్ చేశారు.
Next Story