Sat Oct 12 2024 06:58:41 GMT+0000 (Coordinated Universal Time)
భార్యను అప్పగించాలంటూ వార్నింగ్... సెల్ఫీ వీడియో కలకలం
పాల్వంచలో ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణ కేసులో మరో సంచలనం వెలుగు చూసింది.
పాల్వంచలో ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణ కేసులో మరో సంచలనం వెలుగు చూసింది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ విడుదల చేసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతుంది. ఎమ్మెల్యే వనమా నాగేశ్వరరావు కుమారుడు వనమా రాఘవపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. సెల్ఫీ వీడియోలో వనమా రాఘవపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు.
దుర్మార్గుడు రాఘవ...
తన భార్యను తీసుకుని హైదరాబాద్ రావాల్సిందిగా వనమా రాఘవ తనను ఆదేశించినట్లు వీడియోలో తెలిపారు. వనమా రాఘవను ఎదగనివ్వకుండా చేయాలని కోరారు. డబ్బు ఇవ్వగలను కాని, తన భార్యను ఎలా ఇవ్వగలనని తాను అన్నట్లు తెలిపారు. రాజకీయ, ఆర్థిక బలుపు ఉన్న వనమా రాఘవను ఏం చేయాలని ఆయన వీడియోలో ప్రశ్నించారు. రామకృష్ణ కుటుంబం ఇటీవల పాల్వంచలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాఘవ పరారీలో ఉన్నారు
Next Story