Mon Mar 23 2026 02:49:22 GMT+0530 (India Standard Time)
గ్రానైట్ రాయి ఘటనలో మూడుకు చేరిన మృతుల సంఖ్య
గ్రానైట్ రాళ్లతో వెళుతున్న లారీ నుంచి పడిన ఘటనలో మరో వ్యక్తి మరణించాడు. దీంతో మరణించిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది.

గ్రానైట్ రాళ్లతో వెళుతున్న లారీ నుంచి పడిన ఘటనలో మరో వ్యక్తి మరణించాడు. దీంతో మరణించిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. మహబూబాబాద్ లో ఈ ఘటన నిన్న చోటు చేసుకుంది. గ్రానైట్ రాళ్ల లోడ్ తో వెళుతున్న లారీ నుంచి రాళ్లు కిందకు పడటంతో ఆటో మీద పడి నిన్న ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. నూతన సంవత్సరం రాకముందే వారి కుటుంబాల్లో విషాదం నింపింది.
చికిత్స పొందుతూ...
బానోత్ సుమన్, శ్రీకాంత్ అనే వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈరోజు ఉదయం చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రానైట్ లారీ ఖమ్మం వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదకరంగా తీసుకు వెళుతూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోని యాజమాన్యంపై కూడా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశముంది.
Next Story

