Thu Mar 19 2026 08:37:14 GMT+0530 (India Standard Time)
లోన్‌యాప్ వేధింపులకు మరో వ్యక్తి బలి
లోన్‌యాప్ వేధింపులకు మరో వ్యక్తి బలయ్యాడు. మేడ్చల్ జిల్లా జగద్గిరి గుట్టలో ఈ ఘటన చోటు చేసుకుంది.

లోన్‌యాప్ వేధింపులకు మరో వ్యక్తి బలయ్యాడు. మేడ్చల్ జిల్లా జగద్గిరి గుట్టలో ఈ ఘటన చోటు చేసుకుంది. జగద్గిరి గుట్టకు చెందిన రమేష్ బలవన్మరణం పొందాడు. లోన్ యాప్ ద్వారా రమేష్ నలభై వేలు రుణం తీసుకున్నాడు. రుణం తిరిగి చెల్లించాలంటూ రమేష్ పై లోన్‌యాప్ సంస్థ ప్రతినిధులు వత్తిడి తేవడం ప్రారంభించారు.
బలవన్మరణం...
వత్తిడి తట్టుకోలేని రమేష్ బలవన్మరణాకి పాల్పడ్డాడు. దీంతో జగద్గిరిగుట్టలో విషాదం నెలకొంది. లోన్‌యాప్ నిర్వాహకుల కారణంగానే రమేష్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
Next Story

