Sat Sep 07 2024 11:07:44 GMT+0000 (Coordinated Universal Time)
2,200 కోట్ల చీటింగ్... హైదరాబాద్ లో మరో మోసం
హైదరాబాద్ లో మరో భారీ మోసం వెలుగు చూసింది. 2,200 కోట్ల రూపాయలను హవాలా మార్గం ద్వారా హాంకాంగ్ కు తరలించారు
హైదరాబాద్ లో మరో భారీ మోసం వెలుగు చూసింది. 2,200 కోట్ల రూపాయలను హవాలా మార్గం ద్వారా హాంకాంగ్ కు తరలించారు. ఆన్ లైన్ గేమింగ్, పెట్టుబడుల పేరుతో చీటింగ్ జరిగినట్లు గుర్తింాచరు. 13 బోగస్ సంస్థలను ఏర్పాటు చేసి వాటి నుంచి హవాలా ద్వారా కోట్లాది రూపాయల నిధులను హాంకాంగ్ కు తరలించారని పోలీసులు చెబుతున్నారు. 13 బోగస్ సంస్థలపై ఆరా తీశఆరు.
హవాలా ద్వారా....
నకిలీ పత్రాలను చూపి అనుమతులను తీసుకుని కంపెనీలను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. కంపెనీల డైరెక్టర్లు, ప్రమోటర్లు, ఛైర్మన్లపై ఇప్పటికే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఫిర్యాదు చేసింది. మాల్ 008, మాల్ 98, YS0123, రిబేట్ పెట్టుబడుల యాప్స్ పేరుతో మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. దీని వెనక చైనా కంపెనీల ప్రమేయం ఉందని తెలుసుకున్నారు. ఈకేసులో ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేశారు. చైనా కంపెనీలకు సహకరించారని అనుమానం ఉన్న మరో ఇద్దరి కోసం సీసీఎస్ పోలీసులు వేట ప్రారంభించారు.
Next Story