Sun Mar 15 2026 15:24:36 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ భారీగా నగదు పట్టివేత
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరోసారి భారీగా నగదు పట్టుబడింది.89 లక్షలను పోలీసులు పట్టుకున్నారు.

హైదరాబాద్ లో హవాలా నగదు భారీగా పట్టుబడుతుంది. టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో ఇటీవల కాలంలో పెద్దమొత్తంలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరోసారి భారీగా నగదు పట్టుబడింది. రోడ్ నెంబరు 71లో ఈ నగదును టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
కారులో తరలిస్తుండగా...
టీఎస్ 27 D 7777 నెంబరు కారులో తరలిస్తున్న 89.92 లక్షల నగదును వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని టాస్క్‌ఫోర్స్ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ నగదును ఎక్కడకు ఎవరికి తీసుకెళుతున్నారన్న విషయం తెలియాల్సి ఉంది.
Next Story

