Sat Sep 07 2024 10:46:00 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఛత్తీస్ గడ్ లో మరో భారీ ఎన్ కౌంటర్... పది మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్ గడ్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు
ఛత్తీస్ గడ్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. భారీగా ఆయుధాలను, విప్లవసాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. మృతి చెందిన వారిలో అగ్రనేతలు కూడా ఉన్నారని తెలిసింది.
వరస దెబ్బలు...
మావోయిస్టులకు ఇటీవల వరస దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల కాలంలో వరస ఎన్ కౌంటర్ లు జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు పెద్దయెత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు కూడా ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. పీడియా ప్రాంతంలో ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
Next Story