Fri Oct 04 2024 06:31:57 GMT+0000 (Coordinated Universal Time)
నందకుమార్ పై మరో కేసు?
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ పై మరో ఫిర్యాదు అందింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ పై మరో ఫిర్యాదు అందింది. మానిక్ చంద్ యజమాని కుమారుడు ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నందకుమార్ పై మరో కేసు నమోదయ్యే అవకాశముంది. మానిక్ చంద్ కంపెనీ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలసులు దర్యాప్తు చేస్తున్నారు.
రెండు కోట్ల రూపాయలు...
మానిక్ చంద్ పాన్ మసాలా నిర్వాహకుల నుంచి నందకుమార్ డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. తమ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే యాభై శాతం వాటా ఇస్తానని నందకుమార్ తమను నమ్మించి మోసం చేసినట్లు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నందకుమార్ వల్ల తాము రెండు కోట్ల రూపాయలు నష్టపోయామని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Next Story