Sun Mar 08 2026 00:14:22 GMT+0530 (India Standard Time)
కొండగట్టులో చోరీ.. బంగారు ఆభరణాలు?
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. స్వామి వారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లోనూ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. బంగారు నగలతో పాటు వెండి ఆభరణాలను కూడా చోరీకి గురయినట్లు అధికారులు గుర్తించారు.
సీసీ టీవీ ఫుటేజీ ద్వారా...
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా అనుమానితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి నేరగాళ్లను పట్టుకునేందుకు వెళ్లినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. రాత్రి భక్తుల రూపంలో వచ్చి చోరీకి పాల్పడ్డారని తెలుస్తోంది.
Next Story

