Sun Feb 01 2026 20:02:20 GMT+0000 (Coordinated Universal Time)
అనంతపురం జిల్లాలో త్రిబుల్ మర్డర్
అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి చేతిలో దంపతులు

అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి చేతిలో దంపతులు హత్యకు గురయ్యారు. వారి కుమార్తెను కూడా హత్య చేసేందుకు ప్రయత్నించగా.. ఆమె కేకలు వేయటంతో పారిపోడానికి యత్నించాడు. స్థానికులు చుట్టుముట్టి రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో నిందితుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.
యాడికి మండలం నిట్టూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. సోమక్క(47), బాలరాజు(53) దంపతులు వారి ఇంటి ముందు నిద్రపోయారు. ఈ సమయంలో అదే ప్రాంతానికి చెందిన ప్రసాద్(35) అనే వ్యక్తి దంపతులపై కొడవలితో దారుణంగా దాడి చేసి హత్య చేశాడు. పక్కనే నిద్రిస్తున్న కుమార్తెను కూడా హత్య చేయాలని భావించాడు. ఇంతలోనే ఆమె తేరుకోవటంతో కేకలు వేసింది. అరుపులు విన్న స్థానికులు హత్య చేసిన ప్రసాద్ ను పట్టుకున్నారు. ప్రసాద్ పారిపోయే ప్రయత్నం చేయడంతో స్థానికులు రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో అతడు కూడా చనిపోయాడు. హంతకుడు ప్రసాద్‌కు మతిస్థిమితం లేదని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Next Story

