Sat Oct 12 2024 05:41:23 GMT+0000 (Coordinated Universal Time)
వాకింగ్ వెళ్లిన సినీనటిపై దాడి... ఫోన్ కోసమేనా?
మార్నింగ్ వాకింగ్ కు వెళ్లిన నటి చౌరాసియా పై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డారు. కేబీఆర్ పార్కు వద్ద ఘటన జరిగింది
మార్నింగ్ వాకింగ్ కు వెళ్లిన సినీనటి చౌరాసియా పై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డారు. కేబీఆర్ పార్కు వద్దకు వాకింగ్ వెళ్లగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో సినీనటి చౌరాసియా కేబీఆర్ పార్కు వద్దకు వాకింగ్ కు వెళ్లారు. ఒంటరిగా వెళ్లిన ఆమెపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశారు.
పిడిగుద్దులు గుద్ది....
చౌరాసియా వాకింగ్ చేస్తుండగా ఒక్కసారి ఆమెపై దాడికి దిగి పిడిగుద్దులు గుద్దాడు. దీంతో ఆమె ఒక్క క్షణం ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడ్డారు. ఆమె చేతిలో ఉన్న ఫోన్ కోసమే అతడు ఈ దాడికి దిగినట్లు తెలిసింది. చౌరాసియా ఫోన్ తీసుకుని దుండగుడు పారిపోయారు. చౌరాసియా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
Next Story