Mon Feb 02 2026 08:23:15 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్టీసీ బస్సునే దొంగలెత్తుకెళ్లారు.
ఆర్టీసీ బస్సును దొంగిలించారు. కర్ణాటకలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఆర్టీసీ బస్సును దొంగిలించారు. కర్ణాటకలో ఈ ఘటన చోటు చేసుకుంది. కల్యాణ కర్ణాటక రాష్ట్ర రావాణా సంస్థకు చెదిన బస్సును కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బస్టాండ్ లో పార్క్ చేసి ఉన్న బస్సును తీసుకెళ్లిపోయారు. కర్ణాటకలో మిస్ అయిన బస్సు తెలంగాణలో లభించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణలో లభ్యం...
కలబురిగి జిల్లాలో చించోలి స్టాండ్ లో పార్క్ చేసి ఉంచిన ఆర్టీసీ బస్సును కొందరు దొంగలు ఎత్తుకెళ్లారు. దీని నెంబరు కేఈ -38 ఎఫ్ -971. బీదర్ రెండో డిపోకు చెందిన ఈ బస్సు నిత్యం చించోలి - బీదర్ ల మధ్య నడుస్తుంది. అయితే ఈ బస్సు తెలంగాణలోని తాండూరు మీదుగా తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. రెండు పోలీసు బృందాలు ప్రయత్నించి చివరకు తెలంగాణలో కర్ణాటక ఆర్టీసీ బస్సును స్వాధీనం చేసుకున్నారు.
Next Story

